కవిసమ్రాట్

విశ్వనాథ సత్యనారాయణ

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 20వ శతాబ్దాన్ని సంప్రదాయ సాహిత్యంతో చైతన్య పరచిన వటవృక్షము.
ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి ఆయన ఒక పెద్ద దిక్కు.
ఆయన జీవిత ప్రయాణం లో చేసిన సాహితీ సేద్యం అజరామరము.
సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతమైన పాండిత్యం ఆయన సొంతం.
సాహితీ సామ్రాజ్యానికి ఆయన కవిసమ్రాట్.
తెలుగుజాతికి తొలి జ్ఞానపీఠం అందించిన ఘనత విశ్వనాథం వారిదే.
తెలుగు సాహిత్యవనంలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదు.
నిద్రాణ వ్యవస్థ లో ఉన్న జాతిని కావ్యాలతో, కవితలతో, నవలలతో, నటకాలతో, విమర్శలతో తట్టిలేపిన సాహితీ శ్రామికుడు.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అనుపమాన ప్రతిభ పాఠవాలు కలిగిన సాహితీవేత్త.
ఆయన ప్రతీ రచన లో స్వయం ప్ర్రేరణ, ఆత్మ బోధన, జీవుని వేదనని స్ఫురింపచేస్తాయి.
ప్రతీ అక్షరం ఒక అసాధారణ ఉహాశక్తి కనబరుస్తుంది.
ఆయన అద్భుత రచన శైలి పాఠకుల హృదయాలలో కొత్త ఉత్సాహం నింపుతుంది.