కవిసమ్రాట్

విశ్వనాథ సత్యనారాయణ

WhatsApp Image 2019-04-19 at 4.32.41 PM

KAVISAMRAT KALAPRAPOORNA
PADMA BHUSHAN
JNANAPITH AWARDEE
DR. VISWANADHA SATYANARAYANA
(10 September 1895 –
18 October 1976)

WhatsApp Image 2019-04-19 at 4.32.41 PM

విశ్వనాథ సత్యనారాయణ “కవిసమ్రాట్” బిరుదాంకితుడు, తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.

20వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు – కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు – ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే “నేను వ్రాసిన పద్యముల సంఖ్య, ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును”.ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును.

విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు -“ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం – ఈ వ్యక్తిత్వం.”

Viswanatha Satyanarayana was born to Sobhanadri and Parvathi in the year 1895 at Vijayawada, Krishna District, Andhra Pradesh. He was a Telugu writer of the 20th century. His works included poetry, novels, drama, short stories and speeches, covering a wide range of subjects such as analysis of history, philosophy, religion, sociology, political science, linguistics, psychology and consciousness studies, epistemology, aesthetics and spiritualism. He was a student of Chellapilla Venkata Sastry. Chellapilla was familiar to be known as Tirupati Venkata Kavulu duo, Diwakarla Tirupathi Sastry and Chellapilla Venkata Sastry. Viswanatha’s style of poetry was classical in nature and his popular works include Ramayana Kalpa Vrukshamu (Ramayana the wish-granting divine tree), Kinnersani patalu (Mermaid songs) and Veyipadagalu (The Thousand Hoods).

He worked as the first principal of Karimnagar Government College (1959–61).

He was awarded the Jnanpith Award and Padma Bhushan in 1971.